తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం
తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం
తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకొమ్మ అనుబంధం
ఏడూ అడుగులు నడిచిన వాడే ఏడూ జన్మలు తోడుంటాడు
భర్తగా నిను భరించు వాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు
అతని హృదయం నాతి చరామి
అగ్ని హోత్రమే అందుకు హామీ
అతని హృదయం నాతి చరామి
అగ్ని హోత్రమే అందుకు హామీ
తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం
తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకొమ్మ అనుబంధం
శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో
దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో
దాసీ నీవై ప్రేయసి నీవై నీవే తన ప్రాణమై
నిండు ప్రేమను తనకందించు నూరేళ్లు నడిపించు
పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి
ఎన్ని జన్మలైనా
మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం
మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం
తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం
తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకొమ్మ అనుబంధం
తెగువతో తన ప్రతి ప్రాణాలే తిరిగి తెచ్చుకున్న ఇల్లాలే
అడవిపాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే
చెదిరిపోని నుదిటి రాతకు శ్రీకారం దాపంతులే
గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్లు ఇద్దరివీ
పగలు రేయిగా బ్రతుకే హాయిగా
కలకాలం నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా
ఆలూమగలే సృష్టికే మూలం
వారికే తల వంచును కాలం
ఆలూమగలే సృష్టికే మూలం
వారికే తల వంచును కాలం