• Song:  Nee kosam nee kosam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

నీకోసం నీకోసం జీవించ చిలకా నా ప్రాణం నీవేనే మణితునికా నాకోసం నాకోసం నిన్నే నా జతగా ఏ దైవం పంపెనో బహుమతిగా నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా నాకోసం నాకోసం నిన్నే నా జతగా ఏ దైవం పంపెనో బహుమతిగా నా ఊపిరిలో ఉయ్యాలేసి నూరేళ్ళ కాలం నిను లాలించాలి వెచ్చని కలల్ని పంచాలీ నీ స్నేహంలో స్నానం చేసి నా కన్నె దేహం తరించిపోవాలి తీయని స్వరాలూ పాడాలీ పరులకు ఎన్నడూ తెలియని చల్లని చెలిమితో ఈ నా అనురాగం నీ గుండెనే మీటనీ విరహపు వేడికి కనబడకా విడవని జోడుగా ముడిపడగా అల్లే ఈ బంధం కలకాలం ఉండిపోనీ నీకోసం నీకోసం జీవించ చిలకా నా ప్రాణం నీవేనే మణితునికా కాసేపైనా కల్లోనైనా నీ ఊహలేనీ క్షణాలు ఉన్నాయా ఒంటరి తనాలు ఉన్నాయా ఎం చేస్తున్నా ఎటు చూస్తున్నా నీ రూపులోనే ప్రతీది చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా మమతలు చిందిన మధువుల విందుకు అతిధులుగా ఆహ్వానిద్దాం ఆరారు కాలాలనీ అలలకు అందని జాబిలినీ వెన్నెల వానగా దించుకునే గెలిచే సంద్రంలా సంతోషం పొంగి పోనీ నాకోసం నాకోసం నిన్నే నా జతగా ఏ దైవం పంపెనో బహుమతిగా నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neekosam neekosam jeevincha chilakaa Naa praanam neevene manitunakaa Naakosam naakosam ninne naa jatagaa E daivam pampeno bahumatigaa Ninnoo nannoo penavese preme saakshigaa Kannoo kannoo kalabose kalale pandagaa Minnoo mannoo ekam cheddaam harivillugaa Naakosam naakosam ninne naa jatagaa E daivam pampeno bahumatigaa Naa oopirilo uyyaalesi noorella kaalam Ninu laalinchaali vechchani kalalni panchaalee Nee snehamlo snaanam chesi naa kanne deham Tarinchipovaali teeyani swaraalu paadaalee Parulaku ennadu teliyani challani chelimito Ee naa anuraagam nee gundene meetanee Virahapu vediki kanabadakaa vidavani joduga mudipadagaa Alle ee bandham kalakaalam vundiponee Neekosam neekosam jeevincha chilakaa Naa praanam neevene manitunakaa Kaasepainaa kallonainaa nee oohalenee Kshanaalu unnaayaa ontari tanaalu unnaayaa Em chestunnaa etu choostunnaa Nee roopulone prateedi choostunnaa Ninne prapanchamantunnaa Mamatalu chindina maduvula vinduku Atidhulugaa aahwaniddaam aaraaru kaalaalanee Alalaku andani jaabilinee vennela vaanaga dinchukunee Geliche sandramlaa santosham pongi ponee Naakosam naakosam ninne naa jatagaa E daivam pampeno bahumatigaa Ninnoo nannoo penavese preme saakshigaa Kannoo kannoo kalabose kalale pandagaa Minnoo mannoo ekam cheddaam harivillugaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Preyasi Raave
  • Cast:  Raasi,Srikanth
  • Music Director:  M M Srilekha
  • Year:  1999
  • Label:  Aditya Music