నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ
గాలినడిగా మబ్బులనడిగా
రామచిలుక రెక్కలనడిగా
క్షేమంగా ఉందా అనీ
ఐన ఇంతవరకు ఆచూకీ లేక
తెగిన గాలి పటమై తిరిగా
ఎటు దారి తోచక ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమ
ఏనాటికి చూపునో చిరునామా
నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ
ఇపుడే ఇటు వెళ్ళిందంటూ
చిరుగాలి చెప్పింది
నిజమే ఇంకా గాలుల్లో చెలి పరిమలముంది
ఇందాక చూశానంటూ సిరిమల్లె చెప్పింది
ఇదిగో అంటూ తనలో
చెలి చిరునవ్వే చూపింది
ఈ గుడి గంటల్లో తన
గాజుల సడి వింటుంటే
తాను ఈ కోవెల్లో
ఇప్పటి వరకు ఉన్నట్టే
ఎటు చూసిన తన జాడలు
ఎటు వెళ్లిందో ఈ లోపునే
నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ
నడయాడే దీపంలాంటి
ఆ రూపం చూస్తుంటే
కనుపాపల్లో కలకాలం కొలువుండీ పోతుంది
నడకైనా నాట్యంలాగే
అనిపించే తన వెంటే
దివిలో ఉండే మెరుపే దిగి
వచ్చిందనిపిస్తుంది
కొందరు చూసారో కలగన్నమనుకున్నారో
అందుకనే ఏమో తాను నిజం కాదనుకున్నారో
బతిమాలినా బదులివ్వదే
తాను ఉందంటే నను నమ్మరే
నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ
గాలినడిగా మబ్బులనడిగా
రామచిలుక రెక్కలనడిగా
క్షేమంగా ఉందా అనీ
ఐన ఇంతవరకు ఆచూకీ లేక
తెగిన గాలి పటమై తిరిగా
ఎటు దారి తోచక ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమ
ఏనాటికి చూపునో చిరునామా
నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ