• Song:  Manasuna Unnadi(male)
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

మనసున వున్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా మనదనుకున్నది చేజారిందని నమ్మకపోతే ఎలా మరి మరి తలచి ఊహలలోనే దాచి చాటుగా చూసేదెలా తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా ఇకనైనా చేరగాలి నల్లని నీడలా నను వెంటాడే కళా మనసున వున్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా నెల కందించి ఆకాశ గంగని నింగి గుండెల్లో నలుపు కడగని కురిసే చల్లని వాన జల్లుతో కళ్ళ ముందున్న సత్యాన్ని చూపని రెప్ప చాటున్న నిదుర కరగని ఉబికే వెచ్చని కన్నీళ్లతో అందిస్తున్న నా ప్రియమైన నీకు అక్షింతలుగా నా ప్రతి ఆశనీ కలకాలం నీ నవ్వై నిను నడిపించని నను వెంటాడే కళా మనసున వున్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా నన్ను రమ్మన్నా చెలిమి వెన్నెల దాటి రానంది చీకటి కాపలా ఇకపై తెరలను తీసేదెలా నిన్ను నిన్నల్లో ఆపిన నిజమిలా జ్ఞాపకాలతో అల్లింది సంకెల గతమే సిలువగా మోసేదెలా ఇచ్చేస్తున్న నా ప్రియమైన నీకు నీకై వెతికిన నా ప్రతి శ్వాసనే నిను చేరి సిగ పూవై కొలువై ఉండని నను వెంటాడే కళా మనసున వున్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా మనదనుకున్నది చేజారిందని నమ్మకపోతే ఎలా మరి మరి తలచి ఊహలలోనే దాచి చాటుగా చూసేదెలా తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా ఇకనైనా చేరగాలి నల్లని నీడలా నను వెంటాడే కళా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Manasuna vunnadi cheppedi kadani maatuna daachedela Manadanukunnadi chejarindani Nammakapothe ela Mari mari talachi oohalalone daachi chaatuga choosedela Tagadani telisi talape aapaleni tappunu chesedela Ikanaina cheragali nallani needala nanu ventade kala Manasuna vunnadi cheppedi kadani maatuna daachedela Nela kandinchi aakasa gangani ningi gundello nalupu kadagani kurise challani vaana jallutho kalla mundunna satyanni choopani reppa chaatunna nidura karagani vubike vechani kanneellatho Andistunna na priyamaina neku akshintaluga na prati aasanee kalakalam nee navve ninu nadipinchani nanu ventade kalaa Manasuna vunnadi cheppedi kadani maatuna daachedela Nannu rammanna chelimi vennela daati raanandi cheekati kaapala ikapai teralanu teesedela Ninnu ninnallo aapina nijamila gnapakalatho allindi sankela gathame siluvaga mosedela Ichestunna na priyamaina neku neekai vetikina na prati swasane ninu cheri siga poovai koluvai vundani nanu ventade kala Manasuna vunnadi cheppedi kadani maatuna daachedela manadanukunnadi chejarindani Nammakapothe ela Mari mari talachi oohalalone daachi chaatuga choosedela Tagadani telisi talape aapaleni tappunu chesedela Ikanaina cheragali nallani needala nanu ventade kalaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Preyamaina Neku
  • Cast:  Preetha Vijayakumar,Sneha,Tarun
  • Music Director:  Shiva Shankar
  • Year:  2001
  • Label:  Aditya Music