• Song:  Manasuna unnadi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా చింత నిప్పైనా చల్లగా ఉందని ఎంత నొప్పైనా తెలియలేదని తననే తలుచుకునే వేడిలో ప్రేమ అంటేనే తియ్యని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియాయమైన నీకు నా ఎద కోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింకా చోటెక్కడుందని నిదరే కసురుకొనే రేయిలో మెలుకున్నాయి లే వింత కైపని వేళా ఊహల్లో ఉరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని పగలేదో రేయేదో గురుతే లేదని తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో తెలపకపోతే ఎలా
Manasuna unnadi cheppaalanunnadi Maatalu raave elaa Maatuna unnadi o manchi Sangati bayatiki raade elaa Atadini chooste reppalu vaalipoye Bidiyam aapedelaa Eduruga vaste cheppaka agipoye Talapulu choopedelaa Okasaari dari cheri yada godavemito Telapakapote elaa Manasuna unnadi cheppaalanunnadi Maatalu raave elaa Chinta nippaina challaga undani Enta noppaina teliyaledani Tanane talachukune vedilo Prema antene tiyyani baadhani Leta gundello kondanta baruvani Kottagaa telusukune velalo Kanabadutondaa naa priayamaina neeku Naa yada kota ani adagaalani Anukuntu tana chuttu mari tirigindani Telapakapote elaa Manasuna unnadi cheppaalanunnadi Maatalu raave elaa Neeli kannullo atani bommani Choosi naakinka chotekkadundani Nidare kasurukone reyilo Melukunnaayi le vinta kaipani Vela uhallo uregu choopuni Kalale musurukune haayilo Vinabadutondaa naa priyamaina neeku Aasala raagam ani adagaalani Pagaledo reyedo guruteledani Telapakapote elaa Manasuna unnadi cheppaalanunnadi Maatalu raave elaa Maatuna unnadi O manchi Sangati bayatiki raade elaa Atadini chooste reppalu vaalipoye Bidiyam aapedelaa Eduruga vaste cheppaka agipoye Talapulu choopedelaa Okasaari dari cheri yada godavemito Telapakapote elaa
  • Movie:  Preyamaina Neku
  • Cast:  Preetha Vijayakumar,Sneha,Tarun
  • Music Director:  Shiva Shankar
  • Year:  2001
  • Label:  Aditya Music