మనసే ఎదురు తిరిగే మాట వినదే
కలిసే ఆశ కలిగి కునుకు పడదే
మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
ప్రణయానికి మన జంటనే కదా కొత్త మైమరపు
కలలో మొదటి పరిచయం గురుతూవుందా
సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
చెలివైన చెంగలువా కలలోనే నీ కొలువ
చెలిమైన వెన్నెలవా నిజమైన నా కలవా
నిను వీణాగా కొనగోట మీటితే నిదురపోగలవా
చినుకై కురిసినది కదా చిలిపి సరదా
అలలై ఎగసినది కదా వలపు వరదా
మనసే తడిసి తడిసి అలలా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి తగు దారికనపడదా
వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా
మనసే ఎదురు తిరిగే మాట వినదే
కలిసే ఆశ కలిగి కునుకు పడదే
మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
ప్రణయానికి మన జంటనే కదా కొత్త మైమరపు