మెరిసాడే మెరిసాడే
పసి వాడై మెరిసాడే
మెరిసాడే మెరిసాడే
పసి వాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే
తన వారే వస్తుంటే
అలుపింక మరిచాడే
మనసంతా వెలుగేనా
ఇక చీకటైయింది
తెల్లారి నీ నవ్వుతోనే
పది మంది ఉండగా
ప్రతి రోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతి రోజు పండగే
మెరిసాడే మెరిసాడే
పసి వాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే
గల గల మాటల సడిలో
బరువిక తేలిక పడేలే
ఇరుకుగా మారితే గదులే
చురుకుగా ప్రాణమే కదిలే
మనమంతా కలిసుంటే
కలతున్నా మరిచెనె
మనమంతా వెనకుంటే
మరణాన్ని గెలిచెనే
మిము కలవగా
తెగ కలవరం
అసలిది కదా
ఒక సంబరం
ఒక వరసల
కదిలిన క్షణం
ఇక తెలియదే
ఒంటరితనం
ఎన్నాళ్లకు రారు
కన్నోల్లీలా
వస్తూనే పోయాయి
కన్నీళ్ళిలా
ఇల్లంతా మారింది
సందళ్ళుగా
మీరంతా ఉండాలి
వందెళ్ళిలా
మనవారే వెనకుంటే
మరణాన్ని మరిచేలే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది తెల్లారి
నీ నవ్వుతోనే
పది మంది ఉండగా
ప్రతి రోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతి రోజు పండగే