నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం
వెండి వెన్నెల్లో కళ్యాణం
బ్రహ్మే ఓహో అనే ముహూర్తం
కనుల ముందుందిలే
జగమే అలా ఇలా ఉయ్యాలై
ఊగి మురిసిందిలే
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం
వెండి వెనెల్లో కళ్యాణం
బతుకు ఆడు ఆటలో
మరణం అంటే ఏమిటి
ఆటలోని అలుపు అంటి
చిన్న మలుపులేహే
జీవితాన్ని అందకా
జీవమేల్లిపోదులే
ఆరిపోని అణిగిపోని
చిరంజీవిలే
తల నిండుగా ఆశీస్సులే
ఇక నిండగా ఆయూషులే
యముని పాశమే బిగుసుకున్ననూ
మరణమన్నదీ మరల జననమే
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం
వెండి వెన్నెల్లో కళ్యాణం
బ్రహ్మే ఓహో అనే ముహూర్తం
కనుల ముందుందిలే
జగమే అలా ఇలా ఉయ్యాలై
ఊగి మురిసిందిలే