నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం
నీకు నాకు ప్రేమా ప్రేమంటే ఏంటీ?
చల్లగా అల్లుకుంటది మెల్లగా గిల్లుతుంటది
వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
మరి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు లోకం
నీకు నాకు ప్రేమా ప్రేమంటే ఏంటీ?
చల్లగా అల్లుకుంటది మెల్లగా గిల్లుతుంటది
వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
హో హోహో హోహో హోహో హో
హో హోహో హోహో హోహో హో
తనువు తనువున తీయదనమే నింపుతుంటది
పలుకు పలుకున చిలిపిదనమే చిలుకుతుంటది
కొత్తంగా కొంగొత్తంగా ప్రతీ పనినే చేయమంటది
ప్రాణానికి ప్రాణం ఇచ్చే పిచ్చితనమై మారుతుంటది
ఇంకా ఏమేమ్ చేస్తుంది
పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది
వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది
వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
నువ్వంటే నాకు హ్మ్ మ్ నేనంటే నీకు హ ఆ ఆఆ
నీకు నాకు ప్రేమా ప్రేమంటే ఏంటీ?