• Song:  Enno enno
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఓ డాడీ డాడీ లవ్ యు ఓ మమ్మీ మమ్మీ లవ్ యు వీ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట సంద్రంలో సందడంతా చంద్రుళ్ళో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరే మన ఇంట ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత ఏ పూటైనా హ్యాపీగా ఉంటాం మనకొద్దు అంతకు మించే వేరే వేదాంతం ఏ బాటైనా పరవాలేదంట సమయంతో సాగటమే మన సింపుల్ సిద్ధాంతం చిరుగాలికి పరిమలమిచ్చే సిరిమల్లెలా వనమై ఉందాం గగనాన్ని నేలను కలిపి హరివిల్లులా వంతెన అవుదాం ఆనందం అంటే అర్ధం మనమందాం ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత ఓ డాడీ డాడీ లవ్ యు ఓ మమ్మీ మమ్మీ లవ్ యు వీ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ మమకారాలే పూవులా సంకెళ్ళై గత జన్మల రుణ బంధాలను గుర్తుకు తెస్తాయి అనురాగాలే గుండెల సవాళ్ళై బతుకంటే ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి వరమల్లే దొరికినదేమో అరుదైన ఈ అనుబంధం సిరులున్న దొరకానిదేమో సరదాలతో ఈ సావాసం చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి ఏ చింత చెంతకు రాణి అందాల ఈ సందడి ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట సంద్రంలో సందడంతా చంద్రుళ్ళో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరే మన ఇంట ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత
O daddy daddy love you O mummy mummy love you We love you love you love you so much Enno enno raagaalunde sangeetham kaada chalaki navvula kerintha Enno enno rangulu chinde sambarame raada ilaage nithyam mana venta Sandramlo sandadantha Chandrullo vennelantha Chinnari santhanga chere mana inta Enno enno raagaalunde sangeetham kaada chalaki navvula kerintha Ye pootainaa happyga untam manakoddu anthaku minche vere vedantham Ye baatainaa paravaaledanta samayamtho saagatame mana simple siddhantham Chirugaaliki parimalamicche sirimallela vanamai undam Gaganaanni nelanu kalipi harivillula vanthena avudam Aanandam ante ardham manamandam Prathi poota paatai saage husharu sarigamalo Enno enno raagaalunde sangeetham kaada chalaki navvula kerintha O daddy daddy love you O mummy mummy love you We love you love you love you so much Mamakaaraale poovula sankellai gatha janmala runa bandhalanu gurthuku thesthayi Anuraagaale gundela savvallai bathukante entho theepani chebuthu unnayi Varamalle dorikinademo arudaina ee anubandham Sirulunna dorakanidemo saradaalatho ee saavasam Chirakaalam chigurulu vesthu edagaali Ye chintha chenthaku raani andala ee sandadi Ho enno enno raagaalunde sangeetham kaada chalaki navvula kerintha Enno enno rangulu chinde sambarame raada ilaage nithyam mana venta Ho Sandramlo sandadantha Chandrullo vennelantha Chinnari santhanga chere mana inta enno enno raagaalunde sangeetham kaada chalaki navvula kerintha
  • Movie:  Pelli Chesukundham
  • Cast:  Laila,Soundarya,Venkatesh
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music