పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదింకా ఈడు
నచ్చా చెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కూడు
కాసుకో అమ్మడు కొంటె దూకుడు
పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
సొగసులు ఇమ్మని నిను బతిమాలని
తెగ పడి రమ్మని పిలవకు వయసుని
సొగసులు ఇమ్మని నిను బతిమాలని
తెగ పడి రమ్మని పిలవకు వయసుని
అదిరిపడే పెదవులలో అనుమతిని చదవని
బిడియపడే మనసు కదా అడుగుకు పైపడమని
బెదురూ ఎంత సేపని ఎవరున్నారని
అదును చూసి రమ్మని అందాలయ్య అందాన్ని
పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
చలి చలి గాలిలో చెమటలు ఏంటట
వలపుల లీలలో అది ఒక ముచ్చట
చలి చలి గాలిలో చెమటలు ఏంటట
వలపుల లీలలో అది ఒక ముచ్చట
ఎదురు పడే మదనుడితో వరసాలెల కలుపుట
తెరలు వీడే తరుణంలో తెలియనిదేమున్నదంట
మాయదారి ప్రేమలో ఎం చేయాలట
మోయలేని హాయిలో ఒళ్ళో కొస్తే చాలంట
పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదింకా ఈడు
నచ్చా చెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కుడు
కాసుకో అమ్మడు హొయ్ కొంటె దూకుడు
పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది