• Song:  Anuragame Mantramga
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Yesu dasu

Whatsapp

అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా మమతా కొలువులో జరుగు పెళ్ళికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం అనురాగమే మంత్రంగా మూడు ముళ్లతోనే పెళ్లి పూర్తి కాదు అని మరో మూడీగా చేరుకున్న స్నెహ బంధమిది సప్తపదితో ఆగరాదు జీవితం అని అష్టపదిగా సగమన్న ప్రాయమా పదము ఇది నాతిచరామి మంత్రములో అర్ధం తెలిసిన నేస్తముతో అడుగు కలుపుతూ వెలుగు వెతుకుతూ సాగే సమయమిది ఆగని పయనమిది అనురాగమే మంత్రంగా మమతా కొలువులో జరుగు పెళ్ళికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం అనురాగమే మంత్రంగా ఆడదంటె ఆడదానికి శత్రువు కాదు అని అత్తా గుండెలోన కూడా అమ్మ వున్నదనీ బొమ్మలాటలాడుతున్న బ్రహ్మ రాతలనీ మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది చరితాలు చదవని తోలి కధగా మనసులు ముడి పడు మనుగడగా తరతరాలకు నిలిచిపొమ్మని తల్లిగా దీవించే చల్లని తరుణమిది అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా మమతా కొలువులో జరుగు పెళ్ళికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం
Anuraagamae mamtramgaa anubamdhamae sootramgaa mamata koluvulo jarugu pelliki mangala vaayidyam palikimdi aahvaanam mangala vaayidyam palikimdi aahvaanam Anuraagamae mamtramgaa Moodu mullatonae pelli poorti kaadu ani maro mudiga chaerukunna snaeha bamdhamidi saptapadito aagaraadu jeevitam ani ashtapadigaa sagamanna praema padamu idi Naaticharaami mamtramulo ardham telisina naestamuto adugu kaluputoo velugu vetukutoo saagae samayamidi aagani payanamidi Anuraagamae mamtramgaa Aadadamtae aadadaaniki satruvu kaadu ani atta gumdelona koodaa amma vunnadani bommalaatalaadutunna brahma raatalani maarchi raasi chooputunna maanavatvamidi Charitalu chadavani toli kadhagaa manasulu mudi padu manugadagaa tarataraalaku nilichipommani talliga deevimchae challani tarunamidi Anuraagamae mamtramgaa anubamdhamae sootramgaa mamata koluvulo jarugu pelliki mangala vaayidyam palikimdi aahvaanam
  • Movie:  Pelli
  • Cast:  Maheswari,Prithviraj,Vadde Naveen
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1997
  • Label:  Aditya Music