చెలివో నా చిలిపి కలవో
సిలవో సంకెలవో చిరుత పులివో
నిను చేరాలనే చిరు ఆశా మదిని అణిచేసా
తెలుసుకోవా నీ వాడినని
తెలుపరావా నా దానివనీ కలకాలం
పతివో నా హృదయ జతివో
యతివో నా గతివో మందమతివో
నాలో రేగే ఈ తపనా ఒక సారి వినవా
మదన పడీ మనసు చెడీ
మిగిలాను నీ కోసం ఇలా శిలలా
వయసిది వెళ్ళమన్నదీ
మనసిది ఆపుతున్నదీ
ఎవరికీ చెప్పలేనిది ఎట్టా బతికేదీ
ఎదలకు గదులు ఉన్నవీ
తలుపులు తెరుచుకున్నవీ
కలలకు స్వాగతం అనీ ఎలా తెలిపేది
ఒకరికి ఒకరు ఎవరీమె
తపనలు ఎందుకోసమో
తెలియని జంట జీవులం
భలే సంసారం
మనసుకు మమతా దూరమా
పెదవికి పలుకు దూరమా
వదలని హృదయ భారమా
ఒసేయ్ వెళ్ళిపోవే
చెలివో నా చిలిపి కలవో
యతివో నా గతివో మందమతివో
నిను చేరాలనే చిరు ఆశా మదిని అణిచేసా
మదన పడీ మనసు చెడీ
మిగిలాను నీ కోసం ఇలా శిలలా