కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక కళ్లారా చూడవమ్మా
పేగేయ్ కదలాగా సీమంతమయేలే
ప్రేమ దేవతకు నేడే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీకన్ని
కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా
కన్నీళ్ళలో చెలికాడినే నీ కడుపులో పసివాడిని
ఏనాడు తోడును నీడను వీడనులే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
పేగే కదలగా సీమంతమయేలే
ప్రేమ దేవతకు నేడే
జరిగే వేడుకా కళ్లారా చూడవమ్మా
తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్నా పసిరూపం
నీ రాణి తనము నా రాచ గుణము
ఒకటైన చిరుదీపం
పెరిగేనులే నా అంశము వెలిగెనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యాసనులకు
ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మ నందు ఉంటా
నడిచే దైవమా నీ పాద ధూళులే
పసుపు కుంకుమలు నాకు
ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మ నందు ఉంటా