నీ చుర చుర చుర చూపులే పంజా
సల సల సల ఊపిరే పంజా
నననరమున నెత్తురే పంజా
అణువణువునా సత్తువే పంజా
అలుపేరుగని వేగమే పంజా
ఆదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
చీకటిలో చీకటిగ మూసినా ముసుగా ఆ నిప్పుల బంతి
తప్పదనే యుద్ధముగా వేకువ చూడదా రేపటి కాంతి
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా
ఆటుపోట్లు లేనే లేని సాగరమే ఉంటుందా
ఎత్తు పల్లం లేనే లేని రాదారంటూ ఉందా
ఆకురాలని కొమ్మారెమ్మలు చిగురయ్యే వీలుందా
ఏదేమైనా తుది వరకు ఎదురీత సాగాలిగా
అడుగడుగు అలజడిగా
నీ జీవితమే సెత్రువుకాగా
బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమే పంజా
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా