అనుకోనేలేదుగా కళకానేకాదుగా
కలిసొచ్ఛే కాలమల్లే నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలొచ్చే తీరమల్లే కలిశా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
సుఖాలన్నీ మన చుట్టూ చేరెనే
శుభాలన్నీ మన చుట్టమయ్యే నేడే
ఐదు ప్రాణాల సాక్షిగా నాల్గు కాలాల సాక్షిగా
మూడు పుటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా
కొంటె దూరాలు కొద్దిగా కంటి నేరాలు కొద్దిగా
కొన్ని కౌగిళ్లు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారేనా
ఉల్లాసమే ఉద్యోగమాయె
సంతోషమే సంపాదనాయే
ఇదే బాట ఇదే మాటై ఇలాగే లోకాలనీలాలిలే
ఒకే నువ్వు ఒకే నేను చెరోసగమైతే ప్రేమేలే
ఒకే నవ్వు ఒకే నడక మరోజగమైతే మనమేలే
అనుకోనేలేదుగా కళకానేకాదుగా
కలిసొచ్ఛే కాలమల్లే నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలొచ్చే తీరమల్లే కలిశా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాశ మరో జగమైతే మనమేలే