• Song:  Cheeraloni Goppathanam
  • Lyricist:  Chandrabose
  • Singers:  M.M Keeravani

Whatsapp

చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారమనే దారంతో చేసింది చీర ఆనందం ఆనే రంగులనే అద్దింది చీర మమకారమనే మగ్గంపై నేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో మడికట్టుతో నువ్వు పూజచేస్తే గుడి వదిలి దిగివచ్చును దేవుడు ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు జారుకట్టుతో పడకటింట చేరితే గుండె జారీ చూస్తాడు పురుషుడు నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే దండాలే పెడతారు అందరు అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది చిన్న చీరకొంగులోనా కన్నతల్లి ఉన్నది చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో పసిపాపలా నిదర పోయినప్పుడు అమ్మ చీరె మారెను ఊయలాగా పువ్వై నువ్వు విచుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుతెర గాలి ఆడక ఉక్కపోసినప్పుడు ఆ పైటేగా నీ పాలిట వింజామర ఎండ వాన నీకు తగిలినప్పుడు ఆ కడకొంగే నీ తలపై గొడుగు విదేశాల వనితలకు సారె పోసి పంపేది భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారమనే దారంతో చేసింది చీర ఆనందంగానే రంగులనే అద్దింది చీర మమకారమనే మగ్గంపై నేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
Cheeraloni Goppathanam Telusuko Ee Cheera Katti Aadathanam Penchuko Singaramane Daaramtho Chesindi Cheera Aanandamane Rangulane Addindi Cheera Mamakaramane Maggampai Nesindi Cheera Cheeraloni Goppathanam Telusuko Ee Cheera Katti Aadatanam Penchuko Madikattutho Nuvvu Poojacheste Gudi Vadili Digivachunu Devudu Yenki Kattutho Polam Panulu Cheste Sirilakshmini Kuripinchunu Pantalu Jaarukattutho Padakatinta Cherite Gunde Jaari Choosthadu Purushudu Nindu Kattutho Nuvvu Nadicheluthunte Dandaale Pedatharu Andaru Annam Tinna Tadupari Nee Moothini Tudichedi Kanneerai Unnappudu Nee Chempanu Tadimedi Chinna Cheerakongulona Kannathalli Unnadi Cheeraloni Goppathanam Telusuko Ee Cheera Katti Aadatanam Penchuko Pasipaapala Nidara Poyinappudu Amma Cheere Maarenu Ooyalaga Puvvai Nuvvu Vichukunnappudu Ee Cheerega Andaalaku Adduthera Gaali Aadaka Ukkaposinappudu Aa Paitega Nee Paalita Vinjaamara Yenda Vaana Neeku Tagilinappudu Aa Kadakonge Nee Talapai Godugu Videshaala Vanithalaku Saare Posi Pampedi Bharateeya Samskruthini Sagarvamga Chaatedi Mana Jathiya Jendaku Samananga Nilichedi Cheeraloni Goppathanam Telusuko Ee Cheera Katti Aadathanam Penchuko Singaramane Daaramtho Chesindi Cheera Aanandamane Rangulane Addindi Cheera Mamakaramane Maggampai Nesindi Cheera Cheeraloni Goppathanam Telusuko Ee Cheera Katti Aadatanam Penchuko
  • Movie:  Pallakilo Pellikuturu
  • Cast:  Gowtham,Rathi
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music