సరదాగా చందమామనే చేతివేళ్లపై నిలబడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూట గట్టుకొని నింగి మధ్యలో పరిగెడతావా
వందడుగుల నీటిలోతులో నిట్టనిలువుగా నిలబడతావా
నా గుండెల్లో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగాకా అన్ని కోరితే ఎలాగో ఎలాగో మరీ
నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా ఓఒహ్
ఆ ఆశల లోటు చూడలేనా
నే ప్రేమగా నేను మారుతున్నా ఓహ్
ఆనందపు అంచు తాకలేనా
సరదాగా చందమామనే చేతివేళ్లపై నిలబడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
చిగురులతోనే చీరలు నేసి చేతికి అందించవా
కలువలతోనే అంచులు వేసి కానుక పంపించన
అడిగినదేదో అదే ఇవ్వకుండా అంతకు మించి అందించేది ప్రేమా
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా
నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా ఓఒహ్
ఆ ఆశల లోటు చూడలేనా
నే ప్రేమగా నేను మారుతున్నా ఓహ్
ఆనందపు అంచు తాకలేనానా
సరదాగా చందమామనే చేతివేళ్లపై నిలబడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూట గట్టుకొని నింగి మధ్యలో పరిగెడతావా
వందడుగుల నీటిలోతులో నిట్టనిలువుగా నిలబడతావా
హా హా మెళకువలోనా కళలను కన్నా నిజమును చేస్తావని
చిలిపిగా నేనే చినుకవుతున్నా నీ కలాపండాలనీ ఓహ్
పిలవకముందే ప్రియా అంటూ నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమా
ప్రాణములోనే అమృతమేదో నిమ్పేయ్ వా