• Song:  Rama Sakkani
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  M.M Keeravani,Srilekha

Whatsapp

రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయొలేకూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయొలేకుసున్న వెందుకమ్మో ఎందుకమ్మా తాసుపములు కరిసె ఇసువంటి తావుల్లా భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియాల్లా ఎండిన సెట్టుకు రాలిన ఆకులే ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ ఎక్కెక్కి ఎడ్సెవు ఎందుకమ్మో ఎందుకమ్మా యెట్లా సెప్పుదునయ్యా నా బాధను నా నోటితో ఎవని సెప్పేది నా గోడును నా తండ్రితో దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని నలుగురిలో మీకు నల్ల మగాము చేసే ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా అడవిలో మానెయ్యి పోతానయ్యె పోతనయ్యా రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయొలేకుసున్న వెందుకమ్మో ఎందుకమ్మా తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి బతుకు శాపమైన బంగారు తల్లివి నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మ రాయొలేకుసున్న వెందుకమ్మో ఎందుకమ్మా రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ పటువారి దొరగారు అరిటాకులో నాకు పరవాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న జాలితోటి నాకు జామపండు ఇచ్చి తల మీద శెయి పెడితే తండ్రి లెక్కనుకున్న ఎండి గిన్నెలు పాలు పోసి నాకిస్తుంటే దండి గుణము చూసి దండాలు పెట్టిన కాటు వేసేదాకా తెలవదయ్యా నాకు కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా కొరివి పెట్టి సాగనంపాలయ్యె సమపాలయ్యా అమ్మాఆఆ ఎన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు యెన్నడెరుగని నొప్పి ఎందులకు నొప్పి ఈ బాధ నాకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి ఆడదాని పేగు మీద రాసిన నొప్పి తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ తల్లివైతున్నవే రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లివైతున్నవే రాములమ్మో రాములమ్మ రాములమ్మో రాములమ్మ
Rama Sakkani Thalli Ramulammo Ramulamma Rayolekusunna Vendukammo Yendukamma Rama Sakkani Thalli Ramulammo Ramulamma Rayolekusunna Vendukammo Yendukamma Taasupamulu Karise Isuvanti Taavullaa Bhuthalu Deyyalu Tirigeti Gadiyalla Yendina Settuku Raalina Aakole Okkadaanivi Nuvvu Ramulammo Ramulamma Yekkekki Yedsevu Yendukammo Yendukamma Yetla Seppudunayya Naa Badhanu Naa Notitho Yevani Seppedi Naa Godunu Naa Tandritho Deyyalu Muttina Phalamayyipothini Kannathalliki Nenu Baruvayyipothini Nalugurilo Meeku Nalla Magamu Chese Aadaporiga Nenu Puditinayyo Puditinayya Adavilo Manayyi Pothanayyo Pothanayyaa Rama Sakkani Thalli Ramulammo Ramulamma Rayolekusunna Vendukammo Yendukamma Thelupedo Nalupedo Theluvani Thallivi Bathuku Shapamaina Bangaaru Thallivi Ninnu Kottina Thalli Kanneeru Peduthundi Nannu Thallanukoni Ramulammo Ramulamma Unna Muchata Cheppu Ramulammo Ramulamma Rayolekusunna Vendukammo Yendukamma Rama Sakkani Thalli Ramulammo Ramulamma Patuvaari Doragaaru Aritaakulo Naaku Paravannam Peduthunte Paramathmudanukunna Aadukommani Naaku Aatabommalisthe Dayagalla Maaraju Dharmathmudanukunna Jaalithoti Naaku Jamapandu Ichi Thala Meeda Sheyi Pedithe Thandri Lekkanukunna Yendi Ginnela Paalu Posi Naakisthunte Dandi Gunamu Chusi Dandaalu Pettina Kaatu Vesedaaka Thelavadayya Naaku Kadupulo Vishamayyi Adi Perigipoyindi Koragaani Batukayyi Poyindayyo Poyindayya Korivi Petti Saganampaalayyo Samapaalayya Ammaaaaaaa Yennupusala Nunchi Potti Kadupuloki Palugu Vesi Pegu Pekilinchuthunnattu Ennaderugani Noppi Endulaki Noppi Ee Baadha Naakendukochindayyo Vachindayya Ee Janma Naakendukisthivayyo Isthivayyaa Paapamevvaridaina Paapa Putte Noppi Puriti Thalliki Noppi Pudami Thalliki Noppi Aadadaani Pegu Meeda Raasina Noppi Thalladillaku Bidda Ramulammo Ramulamma Thallivaithunnave Ramulammo Ramulamma Nuvvu Thallivaithunnave Ramulammo Ramulamma Ramulammo Ramulamma
  • Movie:  Osey Ramulamma
  • Cast:  Vijayashanti
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1997
  • Label:  Supreme Music