• Song:  Chowdary Garu
  • Lyricist:  Gundavarapu Subba Rao
  • Singers:  Vandematharam Srinivas

Whatsapp

చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు డొనేషన్ల యుగంలోనే డబ్బు లేని దళితుల్లో వందకోకడు చదువుకుంటే ఓర్చుకొని గుణమెందుకు అరె లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో వెయ్యినొకడు నౌకారైతే ఏడ్చుకునే బుద్ధేందుకు పాయసల జీడిపప్పు తినేవాళ్ళకి సామీ పాయసల జీడిపప్పు తినేవాళ్ళకి మా గంజిలోన ఉప్పు చూసి గొణుగుడేందుకు చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు పల్లెటూళ్ళ సర్పెంచుల పట్టణాల చైరుమాన్ల సగం మీకే ఇస్తామని సంకలెగర వెయ్యమండ్రు సంకలెగర వెయ్యమండ్రు శాసన సభ సభ్యుల్లో పార్లిమెంట్ మేమ్బర్లో ఆరా కోరా సీటులిచ్చి ఐస్ చేసి పోతుండ్రు పవర్ లేని పదవికుండే రిజర్వేషన్ పవర్ లేని పదవికుండే రిజర్వేషన్ ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు ఆ ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు పండుతున్న భూముల్లో 80 శతం మీదే మిల్లుల్లో మిషనులో మూడొంతులు మీకిందే మూడొంతులు మీకిందే రూపాయి కట్టాలని మీ ఇనప పెట్టెలాందే బంగారం వెండి అంతా మీ మెడకే మీ కాళ్ళకే మీ మెడకే మీ కాళ్ళకే 80 శాతం మంది ఎండుకొని చస్తుంటే 20 శాతం మీరు దండుకొని బతుకుతుండ్రు దండుకొని బతుకుతుండ్రు మా చదువులు మా కొలువులు మీకు ఇస్తాము మా చదువులు మా కొలువులు మీకు ఇస్తాము మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తారా చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు మీ అబ్బా పేరేమో సుబ్బారావు గారైతే మా అయ్యా పేరేమో సుబ్బి గడు అయిపోయే మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే మా తమ్ముడు గాడేమో రిక్షాలు తొక్కతుండే మీ అమ్మకు జలుబోస్తే అపోలోలో జేరుతుంటే మా తల్లికి కాన్సర్ ఐతే ఆకూ పసరు మింగుతుండే మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదామంటే దేవుళ్లలో ఒకడైనా దళితుడే లేకపాయె చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు
Chowdary Garu Oo Naidu Garu Reddy Garu Oo Raju Garu Me Peru Chivaralo Aa Tokalenduku Ee Uru Chivarana Ma Pakalenduku Chowdary Garu Oo Naidu Garu Reddy Garu Oo Raju Garu Me Peru Chivaralo Aa Tokalenduku Ee Uru Chivarana Ma Pakalenduku Donationla Yugamlona Dabbu Leni Dalitullo Vandakokadu Chaduvukunte Vorchukoni Gunamenduku Are Lanchagondi Deshamlo Enakabadda Jatullo Veyyikokadu Noukaraite Edchukune Buddenduku Payasala Jeedipappu Tinevallaki Sami Payasala Jeedipappu Tinevallaki Ma Ganjilona Uppu Chusi Gonugudenduku Chowdary Garu Oo Naidu Garu Reddy Garu Oo Raju Garu Me Peru Chivaralo Aa Tokalenduku Ee Uru Chivarana Ma Pakalenduku Palletulla Sarpenchula Pattanala Chairumanla Sagam Meke Istamani Sankalegara Veyyamanru Sankalegara Veyyamanru Shasana Sabha Sabhyullo Parliment Memberlo Araa Koraa Seatulichi Ice Chesi Potunru Power Leni Padavikunde Reservation Power Leni Padavikunde Reservation Aa Pradhanamantri Padaviki Endukundadu Aa Mukhyamantri Padavikaina Endukundadu Chowdary Garu Oo Naidu Garu Reddy Garu Oo Raju Garu Me Peru Chivaralo Aa Tokalenduku Ee Uru Chivarana Ma Pakalenduku Pandutunna Bhumullo 80 Shatam Mede Millullo Mishanullo Mudontulu Mekinde Mudontulu Mekinde Rupayi Kattalanni Me Inapa Pettelande Bangaram Vendantaa Me Medake Me Kallake Me Medake Me Kallake 80 Shatam Mandi Endukoni Chastunte 20 Shatam Meru Dandukoni Batukutundru Dandukoni Batukutundru Ma Chaduvulu Ma Koluvulu Meku Istamu Ma Chaduvulu Ma Koluvulu Meku Istamu Me Sampadalo Reservation Maku Istaraa Chowdary Garu Oo Naidu Garu Reddy Garu Oo Raju Garu Me Peru Chivaralo Aa Tokalenduku Ee Uru Chivarana Ma Pakalenduku Me Abba Peremo Subbaravu Garaite Ma Ayya Peremo Subbi Gadu Ayipoye Me Anna Garemo Vimanallo Ekkutunte Ma Tammudu Gademo Rikshalu Tokktunde Me Ammaku Jaluboste Apololo Jerutunte Ma Talliki Cancer Aite Aku Pasaru Mingutunde Ma Badhalu Ma Gadhalu Devullaki Chebudamante Devullalo Okadainaa Dalitude Lekapaaye Chowdary Garu Oo Naidu Garu Reddy Garu Oo Raju Garu Me Peru Chivaralo Aa Tokalenduku Ee Uru Chivarana Ma Pakalenduku Chowdary Garu Oo Naidu Garu Reddy Garu Oo Raju Garu Me Peru Chivaralo Aa Tokalenduku Ee Uru Chivarana Ma Pakalenduku
  • Movie:  Osey Ramulamma
  • Cast:  Vijayashanti
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1997
  • Label:  Supreme Music