చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోన
ఇన్నాళ్ల నుండి వున్న మాటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైన
పెదవే కదిలించుకో
మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా
సరేలే అనిపించుకో
త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచిచూస్తున్నా
చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోన
ఇన్నాళ్ల నుండి వున్న మాటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైన
గుండె లయలో ఓ దింత దిరన
ఎన్ని కథలో ప్రేమ వలన
హాయి అలలో ఓఓఓ ఊయలవనా
రేయి నదిలో జాబిలవనా
నీ ప్రేమలోనే మేలుకుంటున్న
మేఘాల పైనే తేలిపోతున్న
నాకు తెలియని నన్ను
కనుగొని నవ్వుకుంటున్న
చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోన
ఇన్నాళ్ల నుండి వున్న మాటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైన
వెంట నడిచే ఓఓఓ నీడననుకో
జంట నడిపే జాడననుకో
పూలు పరిచే ఓఓఓ దారిననుకో
నిన్ను కలిసే బంధమనుకో
నా ప్రేమ లోకం నువ్వే అంటున్న
నీతో ప్రయాణం ఇష్టమేనన్న
ప్రేమ తెలిపిన
రామచిలుకను హత్తుకోమన్న
చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోన
ఇన్నాళ్ల నుండి వున్న మాటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైన
పెదవే కదిలించుకో
మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా
సరేలే అనిపించుకో
త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచిచూస్తున్న
చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోన
ఇన్నాళ్ల నుండి వున్న మాటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైన