• Song:  Amma
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sid Sriram

Whatsapp

అమ్మా వినమ్మా నేనానాటి నీ లాలి పదాన్నే ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే మౌనమై ఇన్నాళ్లు నిదురలోనే ఉన్నా గానమై ఈనాడే మేలుకున్నా నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మ నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే అమ్మా అణువణువణువు నీ కొలువే అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా నే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారథివే బెదురు పోవాలంటే నువ్వు కనిపించాలి నిదర రావాలంటే కథలు వినిపించాలి ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతానో నీ కడచూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా మరిమరి నను నువు మురిపంగా చూస్తూ ఉంటె చాలమ్మ పరిపరి విధముల గెలుపులుగా పైకి ఎదుగుతూ ఉంటానమ్మా అయినా సరే ఏనాటికి ఉంటాను నీ పాపాయినై నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే అమ్మా అణువణువణువు నీ కొలువే అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా నే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారథివే అమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Amma Vinamma Nenaanaati Nee Laali Padaanne O Avunamma Nenenamma Nuvu Enaado Kanipenchina Swaraanne Mounamai Innaallu Niduralone Unna Gaanamai Eenaade Melukunnaa Nee Paadalaku Muvvallaa Naa Adugulu Saagaalamma Nee Pedavula Chirunavvullaa Naa Oopiri Velagaalammaa Nirantharam Nee Chantipaapalle Undaali Ne Nennaallaki Ninnodhilenthaga Edhagaalanukone Amma Anuvanuvanuvu Nee Koluve Amma Edhasadilo Sruthilayalu Nuvve Amma Ne Koliche Saradave Nanu Nithyam Nadipe Sarathive Beduru Povaalante Nuvvu Kanipinchaali Nidara Raavaalante Kathalu Vinipinchaali Aakalayyindhante Nuvve Thinipinchaali Prathi Methuku Naa Brathukanipinchaalaa Nuvvuntene Nenu Nuvvante Nenu Anukolekapothe Emaipothaano Nee Kadachoope Nannu Kaasthu Undaka Thadabadi Padiponaa Cheppammaa Mari Mari Nanu Nuvu Muripanga Choosthu Unte Chaalamma Pari Pari Vidhamula Gelupulugaa Paiki Edhuguthu Untaanammaa Ayinaa Sare Enaatiki Untaanu Nee Paapaayinai Ninnodhilenthaga Edhagaalanukone Nirantharam Nee Chantipaapalle Undaali Ne Nennaallaki Nirantharam Nee Chantipaapalle Undaali Ne Nennaallaki Nirantharam Nee Chantipaapalle Undaali Ne Nennaallaki Ninnodhilenthaga Edhagaalanukone Amma Anuvanuvanuvu Nee Koluve Amma Edhasadilo Sruthilayalu Nuvve Amma Ne Koliche Saradave Nanu Nithyam Nadipe Sarathive Ammaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Oke Oka Jeevitham
  • Cast:  Amala Akkeneni,Ritu Varma,Sharwanand
  • Music Director:  Jakes Bejoy
  • Year:  2022
  • Label:  Aditya Music