నువ్వే నా శ్వాసా
మనసున నీకై
అభిలాషా
బ్రతుకైన నీతోనే
చితికైన నీతోనే
వెతికేది నే నిన్నేనని
చెప్పాలని చిన్ని ఆశా
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
నువ్వే నా శ్వాసా
మనసున నీకై
అభిలాషా
పూవుల్లో పరిమళాన్ని
పరిచయమే చేశావు
తారల్లో మెరుపులన్ని
దోసిలిలో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని
మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని
నా ముందే నిలిపినావుగా
నీ జ్ఞాపకాలన్నీ
ఏ జన్మలోనైనా
నే మరువలేనని నీతో
చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
నువ్వే నా శ్వాసా
మనసున నీకై
అభిలాషా
సూర్యునితో పంపుతున్న
అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్న
ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్న
ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్న
అలుపెరుగని హృదయ లయలని
ఏ చోట నువ్వున్నా
నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని
వస్తావని చిన్ని ఆశ
ఓ ప్రియతమా ఓ ప్రియతమా