నాలో మైమరపు నాకే
కనుసైగ చేస్తే ఇలా
ప్రాయం పరదాలు తీసి
పరుగందుకుంటే ఎలా
నా లో నా కే ఏ దో తడబాటె
ఆహ్
పాత పూల గాలి
పాడుతుంటే లాలి
కొత్త జన్మ లాగ
ఎంత చక్కగుందే
చందమామ జారీ చెలిమిలాగా మారి
గోరుముద్ద నాకే పెట్టినట్టు ఉందే
నన్ను గారం చేసే
బాటసారి ఎవరోయి
నేను మారం చేస్తే
నవ్వుతావు ఎందుకోయి
నా స్వరం నన్నే కొత్తగా
ఓయ్ అని పిలిచే తరుణం
ఇలా ఈ క్షణం సిలై మారితే
లికించాలి ఈ జ్ఞాపకం
నువ్వు నన్ను చూసే
చూపు నచ్చుతోందే
నెమలిపించమల్లె నన్ను తాకుతోందే
తేలికైన భారం
దగ్గరైన దూరం
సాగినంత కాలం
సాగని ప్రయాణం
దాచిపెట్టే నవ్వే
కళ్ళలోనే తొంగి చూసే
సిగ్గు మొగ్గైపోయే
గుండెలోన పూలు పూసే
నా ముఖం నాకే ముద్దుగా
చూపేనా గదిలో అద్దం
నిజాంగా ఇది భలేగున్నది
ఈ తైతక్క నాకెందుకుకో
ఆశలన్నీ మల్లి
పూసా గుచ్చుకుంటే
ఉన్నపాటు నేనే
తుళ్లిపడుతూ ఉన్న
వయసు నన్ను గిల్లి
కాస్త ముందుకెళ్లి
ఊసులాడబోతే ఎందుకాగుతున్న