• Song:  Aakaasam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇదివరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇదివరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే
Aakaasam digi vacchi mabbulutho veyyaali mana pandiri Aakaasam digi vacchi mabbulutho veyyaali mana pandiri Oorantha cheppukune mucchatagaa jaragaali pellante mari Cherisagamavamani manasulu kaluputhu Thera therichina tharunam Idi varakeragani varasalu kaluputhu Murisina bandhujanam Maa illaletha maavilla thoranaalanni pelli subhaleKhale Akshintalesi aaseervadinchamanu pilupulainavi gaalule Aakaasam digi vacchi mabbulutho veyyaali mana pandiri Champalo viraboose ammaayi siggudontharalu aa sompulaku eravese abbaayi choopu thondaralu Ye varaalo ee javaraalai jathapadu samayamlo o o Vaanaville vadhuvuga maari odigina vedukalo Thana sarasana virisina sirisiri sogasula Kulukala kaluvaku kaanukagaa . Eda sarasuna egasina alajadi alale taakagaa Aakaasam digi vacchi mabbulutho veyyaali mana pandiri Oorantha cheppukune mucchatagaa jaragaali pellante mari Vinna vaarevarasalu sannaayi vaari sangathulu Sanna sannagaa rusarusalu viyyaalavaari visavisalu Sandhu choosi chaka chaka aade joodha siKhaamanulu uu uu Pandiranthaa Ghuma Ghumalaade vindu suvaasanalu Thama niganiga nagalanu paduguri eduruga idigidigo ani choopeduthu Thega thirige tarunula tikamaka parugulu choodagaa Aakaasam digi vacchi mabbulutho veyyaali mana pandiri Oorantha cheppukune mucchatagaa jaragaali pellante mari Cherisagamavamani manasulu kaluputhu Thera therichina tharunam Idi varakeragani varasalu kaluputhu Murisina bandhujanam Maa illaletha maavilla thoranaalanni pelli subhaleKhale Akshintalesi aaseervadinchamanu pilupulainavi gaalule
  • Movie:  Nuvvu Naku Nacchav
  • Cast:  Aarthi Agarwal,Venkatesh
  • Music Director:  Koti
  • Year:  2001
  • Label:  Aditya Music