ముందు నుయ్య వెనక గొయ్య
వీడికెంత కష్టమయ్యా
ఏమిటో ఈ ప్రేమ మాయ
యేటి లోకి లాగేనయ్యా
కూతకొచ్చిన కుర్రగాడు
కూలబడుతూ లేస్తున్నాడు
బక్కపలచ పిల్లగాడు
భారమెత్తుకుంటున్నాడు
దిక్కుతోచక ఉన్నాగాని
ఒక్కడే అవుతున్నాగాని
మనసునేమో ఇక్కడ వదిలి
మనిషి మాత్రం నడవవలిసినగతి
ఎంత చిత్రం ఎంత చిత్రం
ఎంతెంత చిత్రం రా
ఎంత చిత్రం ఎంత చిత్రం
ఎంతెంత చిత్రం రా
వీడి వీడి తస్సాదీయ
వీడికెంత కష్టమయ్యా
ఏమిటో ఈ ప్రేమ మాయ
యేటి లోకి లాగేనయ్యా
ఊరు కొత్త నీరు కొత్త
ఉండవలసిన తీరు కొత్త
ఏఉరయ్యే ప్రతివారు కొత్త
ఎదురు ఈత ఎట్ట ఎట్టా
చిలక పక్కన లేకుండానే
గోరువంక ఎగిరేదెట్టా
పౌరుషానికి పోయినాక
పోరు తప్పదని తెలిసిన
బ్రతుకెంత చిత్రం
ఎంత చిత్రం
ఎంతెంత చిత్రం రా
ఎంత చిత్రం
ఎంతెంత చిత్రం రా
చూడు చూడు చిన్నవాడు
ప్రేమలో పడి పోయినాడు
లోకమేదో చూడనొడు
లోతులో దిగిపోయాడు
భారమేమో బోలెడంత
రూపమేమో వెళడాంత
సమస్యేమో సింధువంత
వయసు ఏమో బిందువంతా
ఆశయం ఆకాశమంత
అనుభవం మరి అంతంత
పరువుకు పేరు కోసం
ప్రాణమంటి ప్రేమ కోసం
జారిపోయిన విలువల కోసం
విలువ కలిగిన గెలుపుకోసం
పట్టుదలని పెట్టుబడీగాపెట్టదలచిన
చిన్నవాడికి
ఎంత కష్టం ఎంత కష్టం
ఎంతెంత కష్టం రా
ఎంత కష్టం ఎంత కష్టం
ఎంతెంత కష్టం రా