లాలాలాలాలాల లాలాలాలా
ఎవర్రా ఆ అమ్మాయి ఎలా ఉంటుంది రా
ఊపిరొచ్చినా బాపు బొమ్మ
నెలకొచ్చిన నెలవంకమ్మ
ఊపిరొచ్చినా బాపు బొమ్మ
నెల కొచ్చిన నెలవంకమ్మ
ఇంతవరకు ఏ రవి వర్మ
చూపలేదే ఈ చిరునామా
నవ్వుతుంటే ఈ మణిపూస చిన్నబోదా మోనాలిసా
ఆఅ ఊపిరొచ్చినా బాపు బొమ్మ్మ
నెలకొచ్చిన నెలవంకమ్మ
మెరిసే సింగారం మేలిమి బంగారం
ఏ మానస సరోవరంలో స్నానం చేస్తుందో
ఓఓఓఓ ఒఒఒఒఒ ఓఓఓఓ ఓఓఓ
నీ తీయని స్నేహం తాకిన నా దేహం
ఏ తుంటరి తలపుల తడితో తల తల లాడిందో
నిను చూసి కంటిరెప్ప వెయ్యలేనికా
తల్లడిల్లి పోయే గుండె ఊపిరాడక
కవితల నాన్నల్లె శ్వాస కాళిదాసౌతుంటే చూసా
హా ఊపిరొచ్చినా బాపు బొమ్మ
నెలకొచ్చిన నెలవంకమ్మ
నీలో నా ప్రాణం కొలువుందో ఏమో
నీవైపే పరుగెడుతోంది నిలవని నా పాదం
ఓఓఓఓ ఒఒఒఒఒ ఓఓఓఓ ఓఓఓ
నాలో నీ రూపం వెలిగిందో ఏమో
నా వైపే రానంటోంది నడి రాతిరి పాపం ఓఓఓఓ
కళ్ళముందు ముచ్చటైన జంట ఉండగా
కాలమంతా ఆగిపోదు కాలు సాగక
నడిచి వచ్చే మెరుపుని చూసా
నిన్ను తాకి నిలువునా మెరిసా
ఊపిరొచ్చినా బాపు బొమ్మ
నెల కొచ్చిన నెలవంకమ్మ
ఇంతవరకు ఏ రవి వర్మ
చూపలేదే ఈ చిరునామా
నవ్వుతుంటే ఈ మణిపూస చిన్నబోదా మోనాలిసా