ఏచోట నేనున్నా నిన్నే తలచుకుంటున్న
నీ వెంటే నడిచొస్తుంది నా మనసే
ఒట్టేసి చెబుతున్న ఉండలేకపోతున్నా
ఒక్కసారి వింటే చాలు నీ పిలుపే
విన్నానులే నీ ఎద సందేశం
ఎన్నాళ్లిలా ఒంటరి వనవాసం
ఏచోట నేనున్నా నిన్నే తలచుకుంటున్న
నీ వెంటే నడిచొస్తుంది నా మనసే
నాతోటి నేనే మాటాడుకుంటూ
ఏటో వెళ్ళిపోతూ ఉంటా నువ్వున్నావంటూ
నా నీడ చూసి నే నవ్వుకుంటా
హఠాత్తుగా నువ్వొచ్చావో ఏమో అనుకుంటూ
చలి రాత్రి నీకోసం జోల పాడుతూ ఉన్న
తెల్లవార్లూ నీ పేరే రాసి అలిసిపోతున్న
అదేమిటో దూరంగా వున్నా
ప్రతి క్షణం నీతోనే వున్నా
ఏచోట నేనున్నా నిన్నే తలచుకుంటున్న
నీ వెంటే నడిచొస్తుంది నా మనసే
నీ పేరు చెబితే రాగాలు తీసే
నా ఈడు అల్లరిని నువ్వే వర్ణించాలి
నీ జ్ఞాపకాలే నాలోన దాచే
నీ ప్రేమ కోసం మల్లి మల్లి పుట్టాలి
జాలి లేని ఈ ప్రేమ ఇంత కోత పెడుతుందా
చేరువైన మరు నిముషం గాయమంటూ ఉంటుందా
వసంతమే పల్లకి తెస్తుందా
తదాస్తాని దీవిస్తానందా
ఏచోట నేనున్నా నిన్నే తలచుకుంటున్న
నీ వెంటే నడిచొస్తుంది నా మనసే
విన్నానులే నీ ఎద సందేశం
ఎన్నాళ్లిలా ఒంటరి వనవాసం