గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
గ్రీకు వీరుడు నా రాకుమారుడు
కలాల్లోనే ఇంకా ఉన్నాడు
ఫిలిం స్టార్ లు క్రికెట్ వీరులు
కళ్ళు కుట్టి చూసే కుర్రాడు
డ్రీం బాయ్ రూపు లో చంద్రుడు చూపు లో సూర్యుడు
డ్రీం బాయ్ ఊరని పేరని జాడని చెప్పడు
ఏమి చెప్పను ఎలాగ చెప్పను ఎంత గొప్పవాడే నా వాడు
రెప్ప మూసినా ఎటెపు చూసినా కళ్ళముందే వాడే ఉన్నాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎవ్వరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
నడక లోని ఠీవి చూసి సింహమైనా చిన్నబోదా
నవ్వు లోని తీరు చూసి చల్లగాలి కరిగి పోదా
స్టైల్ లో వాడంతా వాడు లేడు
నన్ను కోరినా మగాళ్లు ఎవ్వరు నాకు నచ్చలేదే
వాట్ టూ డూ
నేను కోరినా ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎందుకో ఆకిలి నిద్దర్రా ఉండనే ఉండదు
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
లోకమంతా ఏకమైనా లెక్క చేయనన్నవాడు
కోరుకున్న ఆడపిల్ల కళ్ళ ముందు నిలవలేడు
చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడు
కన్నె ఊహలో ఉయ్యాల లూగుతూ
ఎంత అల్లరైనా చేస్తాడు
ఉన్నపాటుగా కొరుక్కుతిననుగా
ఎందుకంత దూరం ఉంటాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎవ్వరో వాడితో చెప్పారే ఎదురుగా రమ్మని
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు