దేవతలా నిన్ను చూస్తున్న
దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువ్వు తీస్తున్న
నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా నువ్వెవరమ్మా
ఇంతకీ నాకు నువ్వెవరమ్మా
ఎగిరి ఎగిరి పోయింది సీతాకోక చిలక
మిగిలింది నేలపై అది వాలిన మరక
ఎగిరి ఎగిరి పోయింది సీతాకోక చిలక
మిగిలింది నేలపై అది వాలిన మారక
ఆరారో ఆరారో ఆరారో ఆరారో
దేవతలా నిన్ను చూస్తున్న
దీపంలా జీవిస్తున్నా
సుడి గాలికి చిరిగినా ఆకు అలాగదు
చెలి చూపుకు నలిగినా మనసు మరవదు
నీ వొడిలో చేరలేని నా ఆశలూ
ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలో
ఎండమావిలో సాగే పూల పడవలు
గుండె దాచుకోలేని తీపి గొడవలు
అంది అందని దాన అందమైన దాన
అంకితం నీకే అన్న నను కాదన్న
ఆరారో ఆరారో ఆరారో ఆరారో
దేవతల నిన్ను చూస్తున్న
దీపంలా జీవిస్తున్న
నా ప్రాణం నువ్వు తీస్తున్న
నీ ధ్యానం నే చేస్తున్న
నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు
నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు
నీ వెన్నెల నీడలైన నా ఊహలు
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు
ఈ సమాధి పై పూచే సన్న జాజులు
నిదుర రాని నిట్టూర్పుల జోల పాటలు
చక్కనైన చిన్నదాన దక్కని దాన
రెక్కలు కట్టుకు రానా తెగిపోతున్నా
ఆరారో ఆరారో ఆరారో ఆరారో