నాలోని నువ్వు నీలోని నేను
నవ్వేటి కన్నుల్లో
కలలైనామూ కథలైనామూ
ఊగే ఈ గాలి పూసే ఆ తోట
మనమంతా నేడు
ఒకటైనామూ ఒకటైనామూ
ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు
నినునన్ను కలిపేటి నీలాల సిరులు
ఆ చేదు కాలం మారింది నేడు
చెరసాల బాధ పోతుంది చూడు
పొడిసే పొద్దు ఎగసే ఆనందం
శాశ్వత హోమం కాదిక నా దేహం
చెలియా నా ఊపిరి వచ్చెనుగా తిరిగి
పక్షుల గొంతుల్లో పాటను నేనిపుడు
నాలోని నువ్వు నీలోని నేను
మోసేటి నేలకు
కనులైనామూ కనులైనామూ
హా హా హా హా హా హా హా
నీటిలొ ఈదే చేపకు ఎపుడైనా
దాహం వేస్తుందా తెలుసా నీకైనా
నింగిలొ ఎగిరే కొంగకు ఎపుడైనా
మలినం అంటేనా తెలుసా నీకైనా
లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా
శోకం ఎంతున్నా కాలం ఆగేనా
ఎవరూ ఏమన్నా
ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా
పలికే ఆ చిలుక నవ్వే నెలవంక
ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాదింక
ఏలే భువనాన గెలిచిన జత మాది
మాలా మేమంటే బ్రతుకే ముద్దంటా
నాలోని నువ్వు నీలోని నేను
మోసేటి నేలకు కనులైనామూ