మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ అడగమని అర్ధమందులో ఉంది
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటినా వారికి సొంతమవుతుంది
తెలుసుకుంటే సత్యమిది తలచుకొంటే సాధ్యమిది
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
చెమట నీరు ఛిన్దగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో
పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలా దించగా
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితాలకి ఆది నువ్వు కావలి
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది