• Song:  Gurtukostunnaayi
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sachin Tyler

Whatsapp

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞ్యాపకాలు నిద్ర లేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చుసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పండ్లకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడీ సుబ్బు గాడిపై చెప్పిన చాటి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చినా తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటి సారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న ఆ పిప్పెర్మెంటూ పీరు సాయబు పూసిన సెంటూ చెడుగుడాటాలో గెలిచినా కప్పు షావుకారుకి ఎగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞ్యాపకాలు నిద్ర లేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
Gurtukostunnaayi Gurtukostunnaayi Edalotulo Ye Mulano Nidurinchu Gnyaapakaalu Nidra Lestunnaayi Gurtukostunnaayi Gurtukostunnaayi Ee Gaalilo Ye Mamamtalo Maa Amma Maatalaagaa Palakaristunnaayi Gurtukostunnaayi Gurtukostunnaayi Modata Chusina Turing Cinema Modata Mokkina Devuni Pratima Regu Pandlakai Pattina Kusti Raagi Chembuto Chesina Istri Koti Kommalo Benikina Kaalu Meka Podugulo Taagina Paalu Donga Chaatugaa Kaalchina Beedi Subbu Gaadipai Cheppina Chaadi Mota Baavilo Mitruni Maranam Ekadhaatigaa Edchina Tarunam Gurtukostunnaayi Gurtukostunnaayi Modati Saarigaa Geesina Meesam Modata Vesina Draupadi Vesham Nela Parikshalo Vachina Sunnaa Goda Kurchi Veyinchina Nanna Panchukunna Aa Pippermentu Peeru Saayabu Pusina Scentu Chedugudaatalo Gelichina Kappu Shaavukaaruki Egavesina Appu Modati Muddulo Teliyanitanamu Modati Premalo Teeyandanamu Gurtukostunnaayi Gurtukostunnaayi Edalotulo Ye Mulano Nidurinchu Gnyaapakaalu Nidra Lestunnaayi Gurtukostunnaayi Gurtukostunnaayi
  • Movie:  Naa Autograph
  • Cast:  Bhumika Chawla,Gopika,Ravi Teja
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music