గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర
విరిసిన పూ మాలగా వెన్నుని ఎద వాలాగా
తలుపును లేపాలిగా బాల
పరదాలే తీయక పరుపే దిగనీయక
పవళింప ఇంకా జా మేర
కడవల్లో కవ్వలు సడి చేస్తున్న వినక
గడపలో కిరణాలు లేలేమన్న కదలక
కలికి ఈ కునుకెలా తెల్లవార వచ్చేనమ్మా
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర
నీ కలలన్ని కల్లలై రాతిరిలో కరగవని
నువ్వు నమ్మేలా ఎదురుగ నిలిచెనే కన్యామని
నీ కోసమని గగనమే భువి పైకి దిగి వచ్చేనని
ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామని
జంకేల జాగేల సంకోచాల జవ్వని
బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లనా గ్రోవయి ప్రేమారా నవరాగాలేయ్ పాడనీయ
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర
యేదే అల్లరి వనమాలి నను వీడే మనసున దయమాలి
ఈ నంద కుమారుడు మురళి లోలుడు నా గోపాలుడు ఏడే ఏడే
లీల కృష్ణ కొలిమిలో కమలములు కన్నెమది
తనలో తృష్ణ తేనెల విందిస్తానంటున్నది
అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది
విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేయి జారే ఈ మంచి వేళా మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమరక
వదిలేవో వయ్యారి బృందావిహరి దొరకదమ్మ
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర