చేసేదేదో చేసేముందే
ఆలోచిస్తే తప్పుందా
తోచిందేదో చేసేస్తుంటే
తొందరపాటు కదా
ఆచి తూచి అడుగెయ్యొద్దా
ఈతే తెలియాలి నది ఎదురైతే
పూర్తయి తీరాలి కదా మొదలెడితే
గెలుపే పొందాలి తగువుకు దిగితే
పడిన లేవాలి
ఏ పూటైనా ఏ చోటైనా
నిలవని పయనం సాగాలి
రాళ్లే ఉన్న ముల్లె ఉన్న దారేదైనా
గాని కోరే గమ్యం చూపించాలి
పక్క పక్కనే అక్షరాలను
నిలిపి ఉన్నచిన్న
అర్ధం ఉన్న ఓ పదము కానిదే
అర్ధముందున
నీది అన్న నిర్వచనం ఇచ్చుకో
జీవితానికి ఎం చేసిన
స్పష్టాంగా పోల్చుకో శక్తుందా తేల్చుకో
అతి సులువుగా అయ్యే పనా ఏమనుకున్నా
కష్టాలే ఓర్చుకో ఇష్టాంగా మార్చుకో
అడుగడుగునా ఏ మలుపుల
పడగొడుతున్న ఓహో
కళలకి కళ్ళకి మధ్యన
కనురెప్పే అద్దాన్ని
నమ్మకం నిజమాయె లోపుగా
తప్పని నొప్పి ఉందని
ఆటలే వేటగ మార్చటం
కాలం అలవాటని
గమనించే తెలివుంటే
ప్రళయాన్ని ప్రణయం ఆనవా
పక్క పక్కనే అక్షరాలను
నిలిపి ఉంచిన
అర్ధం ఉన్న ఓ పదము కానిదే
అర్ధముందున
నీది అన్న నిర్వచనం ఇచ్చుకో
జీవితానికి ఎం చేసిన
శ్రీ రాముని బాణమై
సాధించిన శౌర్యమే
ఛేదించదా నీ లక్ష్యము
యముడు ఎదురైనా ఓ హోం
కృష్ణుని సారధ్యమై
సాగిన సామర్ధ్యమే
సాధించద ఘన విజయము
ప్రతి సమరణ ఓ ఓహో
కయ్యామో నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి
గాలిలో కత్తులు దుయ్యకు
శత్రువు లేని దానికి
ఊహలో నిచ్చెనె వెయ్యకు అందని గగనానికి
వ్యర్ధంగా వదిలేస్తే
వందేళ్లు ఎందుకు మనకి
పక్క పక్కనే అక్షరాలను
నిలిపి ఉంచిన
అర్ధం ఉన్న ఓ పదము కానిదే
అర్ధముందున
నీది అన్న నిర్వచనం ఇచ్చుకో
జీవితానికి ఎం చేసిన