ఆకాశమంతా ఆనందమై తెల్లారుతోందే నాకోసమై
ఆలోచనంతా ఆరాటమై అన్వేషిస్తోందే ఈ రోజుకై
యే జిందగీ ఇవ్వాలా కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలమంతా తనదేగా
పాదాలు పరుగయ్యేలా ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు తనలాగా
ఆకాశమంతా ఆనందమై తెల్లారుతోందే నాకోసమై
నా పెదవంచుకు తన పేరు తోరణం
నా చిరునవ్వుకు తనేగా కారణం
దాయి దాయి దాయి దాయి దాయి దాయి
తనుంటే చాలు చాలు
హాయి హాయి హాయి హాయి
పరిమళాలు పంచవా క్షణాలు
మొదలయ్యా నీవలన నీతోనే పూర్తవనా
ఆకాశమంతా ఆనందమై తెల్లారుతోందే నాకోసమై
ఆలోచనంతా ఆరాటమై అన్వేషిస్తోందే ఈ రోజుకై
యే జిందగీ ఇవ్వాలా కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలమంతా తనదేగా
పాదాలు పరుగయ్యేలా ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు తనలాగా