చూస్తున్నా చూస్తూవున్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్లు నాకే తెలియని ఇన్నాళ్లూ నాకే తెలియని
నన్ను నేనే నీలో
చూస్తున్నా చూస్తూవున్నా చూస్తూనే ఉన్నా
పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి
బంగారు ఉదయాల సిరులు నుదుట బాసికంగా చుట్టి
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది
పున్నమి పదహారు కళలు సిగలో పూలుగా పెట్టి
దేవేరిగా పాదం పెడతానంటూ
నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ
నవ నిధులు వధువై వస్తుంటే
సాక్షాత్హు శ్రీమన్నారాయణుడే నేనైనట్టూ
చూస్తున్నా చూస్తూవున్నా చూస్తూనే ఉన్నా
నువ్వు సేవిస్తుంటే నే సార్వభౌముడై పోతాను
నువ్వు తోడై ఉంటె సాగరాలు దాటేస్తాను
నీ సౌందర్యంతో ఇంద్రపదవినేదిరిస్తాను
నీ సాన్నిధ్యంలో నిను స్వర్గమంటే ఎదంటానూ
ఎల్లే వచ్చి వయసును మళ్లిస్తుంటే
నేనే నీ ఒళ్ళో పాపగా చిగురిస్తుంటే
చూస్తున్న
చూస్తున్నా చూస్తూవున్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్లు నాకే తెలియని ఇన్నాళ్లూ నాకే తెలియని
నన్ను నేనే నీలో
చూస్తున్నా చూస్తూవున్నా చూస్తూనే ఉన్నా