హే అందమెట్టి కొట్టావే
అందనంటు పోతావే
గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే
హే హే పట్టు పట్టి పోతున్న
జట్టు కట్టనంటున్న
నిన్ను పట్టి ఇస్తాలే నాలో ప్రేమకే
మగవారంటే పగబడతావే
తెగ తిడుతూ అలా కారాలు నూరి
దూరాలు పోతే కుదిరేదెట్టా
ఓ బేబీ జారిపోమాకే
నన్ను వదిలెళ్ళి పోమాకే
అట్టా మడికట్టుకుంటూనే
దడికట్టుకుంటావా చుట్టూరా అందానికే
వయసుని వాడిపోనీకే
చెప్పవే నాకిక ఓకే
ఇట్టా నీ ఫేటు మార్చేసి
నా రూటులో నిన్ను
చూపిస్త నీ కళ్ళకే
అందమెట్టి కొట్టావే
అందనంటు పోతావే
గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే
నువ్వే చుక్కవి అయితే
ఆ జాబిలి పక్కకు పోదా
నిన్నే వెన్నెల చూస్తే
తన కన్నులు చిన్నవి కావా
అందం ఎంతున్నా
బంధమంటూ ఒకటుంటే
గడిచే ప్రతి నిమిషం
తోడు రాదా నీ వెంటే
ఒకటే లైఫంట
నకరాలొద్దంటా చెప్పిందినమంటా
నీకంట నీరు తుడిచేటి వేలై
నే పడి ఉంటా
ఓ బేబీ జారిపోమాకే
నన్ను వదిలెళ్ళి పోమాకే
అట్టా మడికట్టుకుంటూనే
దడికట్టుకుంటావా చుట్టూరా అందానికే
వయసుని వాడిపోనాకే
చెప్పవే నాకిక ఓకే
ఇట్టా నీ ఫేటు మార్చేసి
నా రూటులో నిన్ను
చూపిస్త నీ కళ్ళకే