మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపేను గండు కోయిల
మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల
ఇంతలో కలపండగ
ఇంటిలో తోలి పండుగ
సింగారి సీతకు సీమంతమై
సరికొత్త ఆశల వసంతమై
మనసు మురిసిపోగా
మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపేను గండు కోయిల
మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల
నీ గుండెలో అనురాగానికి ఒక బొమ్మ గీయన
ఆ బొమ్మలో గల పాపాయికి జోజోలు పాడనా
మన కళలకి ఉదయమిదే అని తెలిపిన కిరణమిది
అణువణువును కలగల్పె మన చెలిమికి సాక్ష్యమిది
మన గడిచిన ప్రతి నిమిషం కనులెదురుగా కనబడగా
పలికించని నవ నాదాలనీ పారాడనీ పసి పాదాలనీ
మనసు మురిసిపోగా
మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపేను గండు కోయిల
మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల
వయ్యారి ఊహలు తియ్యంగా ఊదిన వేణునాదమో
చిన్నారి చిందుల పన్నీటి చినుకుల వాన గానమో
నీ సిగ్గుల సరిగమలో ఏ కులుకుల గమకమిది
నీ ముద్దుల మధురిమలో ఏ మమతల తమకమిది
మునుపేరుగని ప్రియలయలో స్రుతి కలిపినా జత కథలో
సంసార వీణను సవరించగా సంతాన గీతికా రవళించగా
మనసు మురిసిపోగా
మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపేను గండు కోయిల
మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల
ఇంతలో కలపండగ
ఇంటిలో తోలి పండుగ
సింగారి సీతకు సీమంతమై
సరికొత్త ఆశల వసంతమే