రాయలసీమ మురిసిపడేలా రాగలవాడి జన్మతరించేలా
ముత్యమంటి సొగసే మూటకట్టుకుంది మూడుముళ్లు వేయమంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకోమన్నది నిన్ను తన చేయి
పలికే పలుకుల్లో కొలికే తొలకరి ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్ళేలాహిరి జంటే కలిసిందో కలతే హరి
హంసల నడకలా వయ్యారి అయినా ఏడడుగులు నీవెనకే
ఆశల వధువుగా ఇలాగ ఇళపై జారిన జాబిలి తునకే
తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకోమన్నది నిన్ను తన చేయి
హే ఆపండి ఎదవా గోల ఎప్పుడు పిచ్చి గీతలు గీసుకుంటూ కూర్చుంటాది
దీన్ని నేను చేసుకోవాలా
గీతలే అని చిన్న చూపేందుకు వాటిలోతులు చూడలేరేందుకు
నదిలో పడవల వానలో గొడుగులా గువ్వపై గూడులా కంటిపై రెప్పలా
జతపడే జన్మకి తోడు ఉంటానని
మనసులో మాటనే మనకు చెప్పకనే చెబుతుంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి గుండెనే కుంచెగా మలచిందోయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకోమన్నది నిన్ను తన చేయి