నా లోనా నీ వేనా
ప్రేమై నేడు పూచేనా
నా పెదవుల్లో పాటై
ఎగిసే కెరటమవుతుంది
హృదయం
యెదలో నిన్ను చేసింది
పదిలం
నిన్నే చూస్తూ కరిగింది లే
కాలం
పగలే వెన్నెలయింది
భువనం
కలలే మరిచి చూస్తోంది
నయనం
నీలో కలిసి రానంది
నా ప్రాణం
ప్రేమ
ఈ వింత కొత్తగుందిలే
నాలో
నీ జతలో ఈ వేళా
ప్రేమ
ఈ హాయి పొంగుతుందిలే
నాలో
నా జతకై రావేలా
నువ్వే లేని హృదయాల
ప్రళయం
నీతో రాణి జన్మింక
నరకం
నీకై అడుగులేస్తోంది
నా పాదం
పరువం ఉరకెలేస్తున్న
తరుణం
ఆహ చెప్పలేనంత
మధురం
మనసా చేసి పోవద్దులే
గాయం
నీలాంబరమే వాలే నీ కళ్ళలో
తారలే నిన్ను వర్ణించగా
కుంకుమ పువ్వై విరిసే
ఎద నందనం
వెన్నెలై నువ్వు వర్షించగా
పరిమళమావధా నిను తాకే
గాలి
ఎదలయ వినవా శ్వాసే నీవై
పగడపు కాలువ నిను చేరే దారి
పాదముల కెరుకా తోడై రావా
నా లోనా నీ వేనా
సొగసులు పారిజాతమో
నీ పిలుపులు సుప్రభాతమో
వైనం చూస్తే ఋతువులలోన
యాగరం
రూపం చూస్తే మధువుల జలపాతం
న మానసిక రాసే నీకై
వలపుల మృదు కావ్యం
నాలో మౌనం పలికెను హిందోళం
నీ కలయిక పొందే వేళా
కదలదు ఇక కాలం
నా లోనా నీ వేనా
ఎగిసే కెరటమవుతుంది
హృదయం
యెదలో నిన్ను చేసింది
పదిలం
నిన్నే చూస్తూ కరిగింది లే
కాలం
పగలే వెన్నెలయింది
భువనం
కలలే మరిచి చూస్తోంది
నయనం
నీలో కలిసి రానంది
నా ప్రాణం
నా లోనా నీ వేనా