జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న
హితులు స్నేహితులు ఎందరు ఉన్నా
యమునా కోసమే చూస్తున్నా
తెలుగు పలుకు లెన్నెన్నో ఉన్నా
యమునా పదమే తీపంటున్నా
యమునా యమునా యమునా
జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న
నా మదీ మహా నదీ వరదౌతున్నదీ
ఈ ఇదీ ఇలాంటిది ఎపుడూ లేనిదీ
తాను అలా ఎదురౌ క్షణాన
నిలువున కదిలిపోనా
నిలవనా మరీ మరో జగాన
జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న
నా బలం ఘనం జనం యమునా స్నేహమే
నా స్థలం నిరంతరం యమునా తీరమే
మనసే కోరి వలచే
మమతే తనది కాదా
మునగానా తానా మనస్సులోనా
జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న
హితులు స్నేహితులు ఎందరు ఉన్నా
యమునా కోసమే చూస్తున్నా
తెలుగు పలుకు లెన్నెన్నో ఉన్నా
యమునా పదమే తీపంటున్నా
యమునా యమునా యమునా