నాకు నువ్వని మరి నీకు నేనని
మన రెండు గుండెలూగే ఉయ్యాలా
నువ్వు నేనని ఇక యేరు కామని
మన జంట పేరు ప్రేమే అయ్యేలా
సూడసక్కగా ఇలా ఇలా ముచ్చటాడగా
రామసక్కగా అలా అలా ఆడిపాడగా
ఎన్నెన్ని ఆశలో ఎన్నెన్ని ఊహలో
మెలేసుకున్న కొంగు ముళ్లలో
ఎన్నెన్ని నవ్వులో ఇంకెన్ని రంగులో
కలేసుకున్న కొంటె కళ్ళలో
తనాన నానా నానా
తనాన నానా నానా
తనాన నానా నానా
నానా నానా
తనాన నానా నానా
తనాన నానా నానా
తనాన నానా నానా
నానా నానా
గునుగు పువ్వులా తంగేడు నవ్వులా
మన రెండు గుండెలూగే ఉయ్యాలా
గోరు వంకకి సింగారి సిలకలా
మన జంట పేరు ప్రేమే అయ్యేలా
ఎన్ని పొద్దులో ఎన్నెన్ని ముద్దులో
ముడేసుకున్న పసుపు తాడుతో
ఎన్నెన్ని నవ్వులో ఇంకెన్ని రవ్వలో
కలేసుకున్న ఈడు జోడులో
నాకు నువ్వని మరి నీకు నేనని
మన రెండు గుండెలూగే ఉయ్యాలా
నువ్వు నేనని ఇక యేరు కామని
మన జంట పేరు ప్రేమే అయ్యేలా