• Song:  KalluMoosi
  • Lyricist:  Sri Mani
  • Singers:  Suchith Suresan

Whatsapp

కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే రాతిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే తెల్లవారే ఎదురైవస్తే జారుకుంటావే ఊరించకే ఊరించకే ఆ కొంటె చూపుతోటి నన్ను చంపకే కవ్వించకే కవ్వించకే నీ నవ్వు తోటి మాయ చెయ్యకులే చెలియా కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే ఆ దొంగ చూపు హాజరేదో నాకు వేస్తావులే ఎదురే ఉంటే చూడవులే నే వెళిపోతుంటే నువ్వు తొంగి చూస్తావులే నీ గుండెలోన ఎన్ని వేల ప్రేమ లేఖలో నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తేనే తెలిసిందిలే కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే పుస్తకాలలో నువ్వు రాసుకున్న పేరేమిటో ఎగిరే పేజీ చెప్పిందే నీ కదిలే పెదవే చిరు సాక్షమిచ్చిందిలే నను నువ్వు దాటి వెళ్ళిపోవు తొందరెందుకో నీ నీడ నిన్ను వీడి నాకు ఎదురొచ్చి చెప్పిందిలే సిగ్గు నీకే చాలా అందం ముద్దు ముద్దుగ ఉంటావే ఎంత ముద్దుగ ఉంటే మాత్రం అంత సిగ్గేంటే ఎంత దాచాలనుకున్నావో అంత బయటే పడతావే ఎంత మౌనం ఒలికేసావో అంత తెలిసావే తెలిసిందిలే తెలిసిందిలే నీ మూగ కళ్ళలోని భావమేమిటో దొరికిందిలే దొరికిందిలే నీ దొంగ నవ్వుకర్థమేమిటో ఇపుడే
Kallu moosi terichelope Gundeloke cherave Tanivi teera choodhamante Paaripotheve Rathirantha kalalokochi Teepi kaburulu chebuthave Tellavare yedhurai vasthe Jaarukuntave Oorinchake oorinchake Aa konte chooputhoti nannu champake Kavvinchake kavvinchake Nee navvuthoti maaya cheyakule cheliya Kallu moosi terichelope Gundeloke cherave Tanivi teera choodhamante Paaripotheve Aa donga choopu haazaredo Naku vesthavule Yedhure vunte choodavule Ne velipothunte Nuvu thongi choosthavule Nee gundelona yenni vela premalekhalo Nee kallaloki okkasari Choosthene telisindhile Kallu moosi terichelope Gundeloke cherave Tanivi teera choodhamante Paaripotheve Pusthakallo nuvvu rasukunna peremito Yegire pegi cheppindhe Nee kadhile pedhave Chiru sakshamichindhile Nanu nuvvu dhati vellipovu Thondharendhuko Nee needa ninnu veedi naku Yedhurochi cheppindhile Siggu neeke chala andham Mudhu mudhuga vuntave Yentha mudhuga vunte matram antha siggente Yentha dachalanukunnavo Antha bayate padathave Yentha mounam volikesavo antha telisave Telisindhile telisindhile Nee mooga kallaloni bhavamemito Dorikindhile dorikindhile Nee dhonga navvuku ardhamemito ipude
  • Movie:  Majnu
  • Cast:  Anu Emmanuel,Nani
  • Music Director:  Gopi Sunder
  • Year:  2016
  • Label:  Lahari Music Company