ఏడెత్తు మల్లెలే
కొప్పులోన చేరే
దారి లేదే
నీ తోడు కోయిలే
పొద్దుగూకేవేళ
కూయలేదే
రాయెత్తు ఆలా తెరదాటి
చేరరావే చెలియా
ఈపొద్దు పీడకల దాటి
నిద్రొవే సఖియా
నీ కంటిరెప్ప కలనీ
కన్నీటిలోన కథనీ
నీ గుండెలోన సడినీ
నీ ఊపిరైనా వూసునీ
నా ఊపిరాగినా
ఉసురుపోయినా
వదిలిపోనని