నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి
కలహంసలాగ రావే కళలన్ని తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే
నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
దేవుడు కనబడి వరమిస్తే వేయి జన్మలు ఇమ్మంట
ప్రతి ఒక జన్మ నా కంటే నిన్ను మిన్నగ ప్రేమిస్తా
దేవతె నీవని గుడికడత జీవితమంతా పుజిస్తా
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి
ప్రేమకు మరుపే తెలియదులే మనసు ఎన్నడు మరువదులే
తెరలని తీసి నను చూడు జన్మజన్మకు నీ తోడు
వాడనిదమ్మ మన వలపు ఆగనిదమ్మ నా పిలుపు
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి
కలహంసలాగ రావే కళలన్ని తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే
నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి