కదిలే అందాల నది అరెరే నను ముంచినది
ఇక తెలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను
ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను
ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ
ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ
కదిలే అందాల నది అరెరే నను ముంచినది
వాన విల్లు పూల జల్లు రూపు కడితే
నువ్వే కాదా నవ్వే కాదా
నువ్వే కాదా నవ్వే కాదా
కొంటె కళ్ళు చూపు ముళ్ళు గుచ్చి పెడితే
సిగ్గు రాదా చిచ్చు కాదా
సిగ్గు రాదా చిచ్చు కాదా
నీకు పెట్టిన పేరిది భాగ్యం
జపించనే ప్రతి రోజు
నీ పేరు పలికి పలికి నా పెదవి తేనెలాయె
నీ మాట వింటూ వింటూ నా మనసు ఊయలాయె
కదిలే అందాల నది అరెరే నను ముంచినది
చిలక వచ్చి వాలగానే చిట్టి కొమ్మకి
సోకులొచ్చే శోభలొచ్చే
సోకులొచ్చే శోభలొచ్చే
ప్రేమ మెచ్చి తాకగానే చిన్ని గుండెకి
ఊహలొచ్చే ఊసులొచ్చే
ఊహలొచ్చే ఊసులొచ్చే
నువ్వు ఎపుడూ పక్కన ఉంటే ఎక్కడున్నా అద్భుతమే
నీ గాలి సోకగానే నా దారి మారిపోయె
నిమిషానికున్న విలువే నువ్వు దగ్గరుంటే తెలిసె
కదిలే అందాల నది అరెరే నను ముంచినది
ఇక తెలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను
ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను
ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ
ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ