నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే
సమయమే ఇక తెలియనంతగా
మనసునాటు ఇటు కమ్మేసావే
పలు యుగాలకు తనివి తీరని
కళల తలుపులు తెరిచినావే
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే ఓ
చూసే కొద్దీ చూడాలంటూ చూపు నీవైపు
పోనీకుండా పట్టేసావే
ఇచ్చే కొద్దీ ఇవ్వాలంటూ నాకై నేనే నువ్వైపోయేలా చుట్టేసావే
ఒంటరైన లోకం నిండి పోయే నీవుగా
ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదుగా
ఊపిరిలో చిరునవ్వల్లే నీకోసం నేనే వున్నా
నా ప్రేమ దేశం నీకు రాసిచ్చుకున్న
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే ఓ
ఏదో ఉంది ఎంతో ఉంది సూటి బాణాలు
గుప్పించేటి నీ రూపులో
నాదేముంది అంత నీదే మెరుగు పెట్టావే
అందాన్నిలా నీ చూపుతో
చిచ్చు పెట్టినవే వెచ్చనైన శ్వాసలో
గూడు కట్టినవే గుప్పెడంత ఆశలో
తెల్లారే ఉదయాలన్ని నీతోనే మొదలైపోని
నీ జన్మ హక్కైపోని నా రోజులన్నీ
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే