మనసా
మనకూ సెలవే సెలవు
ముసిరే ఊసులు కనవా
ఎదకి ఒక గాయం
వదలమంది ప్రాణం
చెలిమి విడి బంధం
ఎవరు ఇక సొంతం
కలత పడి హృదయం
కరగనంది మౌనం
గతము విడి పాశం
ఏది ఇక బంధం
హే ఇన్నాళ్లు నన్ను
వెన్నంటి ఉన్న నీడ నీవుగా
కొన్నాళ్ళే అంటూ
కోరింది నన్నే వీడమందిగా
నిను తలచే ప్రతి తలపే
ప్రణయాన శోధనా
నను మరిచే మరుక్షణమే
విరహాల వేధనా
ఎదకి ఒక గాయం
వదలమంది ప్రాణం
చెలిమి విడి బంధం
ఎవరు ఇక సొంతం
హే మందార పూలే
మంటల్లే మారే మౌన వేళలో
నిండారా నాతో ఉంటావులే
నా కంట నీరులో
ఇది శరమో కలవరమో
ఎనలేని శూన్యమో
చెలి వరమో తుది క్షణమో
ఎడబాటు సoద్రమో
మనసా
మనకూ సెలవే సెలవు
ముసిరే ఊసులు కనవా