గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది
ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది
ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా
నీ కోపమే నీకు కొరివిలాంటిది
లోలోపలే నిన్ను కాల్చుతుంటది
ద్వేషమును చంపుకుని స్నేహమును పెంచుకొని
క్షేమమును ఎంచుకుని ప్రేమనే పంచుకుని
జీవించారా నే మేలెంచారా
లేకుంటే నీ బతుకు ఇంతేనురా
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది
ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది
ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా
కడుపు కోత జీవితాల కథ ఇదెనురా
కన్నీళ్లు తల్లి ఋణము తీర్చలేవురా
పేగు తెంచుకున్నది జోల పాడుతుంటది
కన్ను మూసుకున్నది మన్ను కలిసి పోతది
ఏది నీదిరా మరి కానిదేదిరా
వాదాల బతుకు ఎపుడు బాధేనురా
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది
ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది
ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా
చేతి చిటికేనేళ్లు కలిసి కల్యాణమై
కాళీ బొటన వేళ్ళు కలిసి నిర్యాణమై
కాలమంతా తీరినా కాళ్ళు లేకపోయినా
చావలేక బతికినా బతుకు చావు కోరిన
మోత ఒకటి రా ఆ రాత ఒకటి రా
ఆఖరికి ఆరడుగులు నెల మిగులురా
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది
ఏ దరి వచ్చావురా జీవ ఏ దారి పోయేవురా
మాసాలు మోసేటి ఈ మాయ జన్మకు
వాసాల పరుపంటరా జీవ పోసేది తుల్సాకు నీళ్లెరా
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది
ఏ దారి వచ్చావురా జీవ ఏ దారి పోయేవురా
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది
ఏ దారి వచ్చావురా జీవ ఏ దారి పోయేవురా
Gummalu thommidi gundemo chinnadi
ye dari vachavuraa jeeva ye dari poyevura
gummalu thommidi gundemo chinnadi
ye dari vachavuraa jeeva ye dari poyevura
Ne kopame neku korivilantidi
lolopale ninnu kalchutuntadi
dweshamunu champukuni snehamunu champukuni
kshemamunu yenchukuni premane panchukuni
jeevincharaa ne melenchara
lekunte nee batuku inthenura
Gummalu thommidi gundemo chinnadi
ye dari vachavuraa jeeva ye dari poyevura
gummalu thommidi gundemo chinnadi
ye dari vachavuraa jeeva ye dari poyevura
Kadupu kota jeevitala kadha idenura
kanneellu talli runamu teerchalevuraa
pegu tenchukunnadi jola padutuntadi
kannu musukunnadi mannu kalisi potadi
yedi neediraa mari kanidediraa
vaadaala batuku yepudu badhenuraa
Gummalu thommidi gundemo chinnadi
ye dari vachavuraa jeeva ye dari poyevura
gummalu thommidi gundemo chinnadi
ye dari vachavuraa jeeva ye dari poyevura
Cheti chitikenellu kalisi kalyanamai
kali botana vellu kalisi niryanamai
kaalamanta teerinaa kallu lekapoyina
chavaleka batikinaa batuku chavu korina
mota okati raa aa rata okati ra
aakhariki aaradugule nela migulura
Gummalu thommidi gundemo chinnadi
ye dari vachavuraa jeeva ye dari poyevura
maasaalu moseti ee maya janmaku
vasala parupantaraa jeeva posedi tulasaaku neellera
Gummalu thommidi gundemo chinnadi
ye dari vachavuraa jeeva ye dari poyevura
gummalu thommidi gundemo chinnadi
ye dari vachavuraa jeeva ye dari poyevura